పాక్ తోక ఎప్పుడూ వంకరే... ట్రంప్ వ్యాఖ్యలను ఎలా రాసిందో తెలుసా? 

పాక్ తోక ఎప్పుడూ వంకరే... ట్రంప్ వ్యాఖ్యలను ఎలా రాసిందో తెలుసా? 

ట్రంప్ మొతేరా స్టేడియంలో ఇండియా గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  తనకు ఇండియా పలికిన స్వాగతం మర్చిపోలేనిదని, ఎప్పటికి గుర్తుండి పోతుందని చెప్పిన ట్రంప్, ఇండియా తనకు నిజమైన స్నేహితుడని చెప్పారు.  ఇండియాతో బలమైన మైత్రి ఉంటుందని చెప్పిన ట్రంప్, పాక్ గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  పాక్ తో సంబంధాలు కొనసాగుతున్నాయని, పాక్ లో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు సైనిక సహాయం చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.  

ఈ వ్యాఖ్యలను పాక్ మీడియా తనకు అనుకూలంగా మార్చుకుంది.  లక్షన్నర మందితో ఏర్పాటు చేసిన మొతేరా స్టేడియం సభలో ట్రంప్ పాక్ ను పొగడ్తలతో ముంచెత్తారని, పాక్ తో సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పడంతో మోడీతో సహా మొతేరా స్టేడియంలో ఉన్న ప్రజలంతా షాక్ అయ్యారని రాసుకొచ్చింది.  ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పాక్ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలం అయ్యిందని చెప్పాలి.  ఇంటర్నేషనల్ మీడియా మొతేరా స్టేడియం సభ గురించి ఒకలా రాసుకొస్తుంటే, పాక్ మీడియా మాత్రం తనకు అనుకూలంగా మార్చి రాసుకొని తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది.