ఎంబీబీఎస్ లో కొత్త సిలబస్

ఎంబీబీఎస్ లో కొత్త సిలబస్

ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ కరికులమ్ లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 21ఏళ్ల తర్వాత ఎంబీబీఎస్ సిలబస్ లో మార్పులు తీసుకురానుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2019 ఏడాదికి గాను మారిన సిలబస్ ను సెప్టెంబర్ లో ప్రకటించనుంది. ఈ మారిన సిలబస్ ఆధునాతన వైద్యా విధానానికి అనుగుణంగా ఉండనుంది. ఫైనల్ సిలబస్ ఇప్పటికే రెడీ అయ్యింది. దీన్ని సెప్టెంబర్ లో ప్రచురించి.. వచ్చే అకడమిక్ విద్యా సంవత్సరం నుంచి అమలులోకి తీసుకురానున్నారు. కొత్త రోగాలకు సంబంధించిన విషయాలను ఇందులో పొందుపరచటమే కాకుండా అసంబద్ధ చాప్టర్స్ ను తొలగించనున్నారు.
కొత్త సిలబస్ ను బోధించేందుకు దేశ వ్యాప్తంగా ట్రైనింగ్ టీచర్స్ ను కూడా ఎంసీఐ నియమించనుంది. ఇప్పటికే దాదాపు 40వేల మందికి కొత్త సిలబస్ పై ట్రైనింగ్ ఇచ్చింది. వీరంతా ఈ కొత్త సిలబస్ ఎలా డీల్ చేయాలనే విషయాలని తమ సహోద్యోగులకు చెప్పనున్నారు. 2013లోనే ఈ కొత్త సిలబస్ ప్రక్రియ ప్రారంభమైనా... గత ఏడాది డిసెంబర్ లో కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. 1997లో ఎంబీబీఎస్ సిలబస్ రివైజ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ తాజాగా ఈ ఏడాది మార్పులు చేయనున్నారు.