హైదరాబాద్‌లో మెడికో అనుమానాస్పద మృతి.. 14వ అంతస్తు నుంచి దూకి..!

హైదరాబాద్‌లో మెడికో అనుమానాస్పద మృతి.. 14వ అంతస్తు నుంచి దూకి..!

హైదరాబాద్‌లో మెడికో అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది... వివరాల్లోకి వెళ్తే ఎల్బీ నగర్‌ సమీపంలోని సాగర్ రింగ్ రోడ్‌ పక్కనేఉన్నఅలేఖ్య టవర్స్‌లో 14వ అంతస్తులో రఘురాం, పద్మ దంపతులు తన కూతురు సాహితీతో కలిసి నివసిస్తున్నారు.. ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (BDS) నాల్గో సంవత్సంర చదువుతోన్న సాహితీ.. ఈరోజు మధ్యాహ్నం సమయంలో 14వ అంతస్తు నుండి బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పైనుండి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.. పోలీసుల మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విచారణ ప్రారంభించారు.