వంద కోట్లు దాటిపోతున్నాయి..

వంద కోట్లు దాటిపోతున్నాయి..

కళారంగం, గ్లామర్ ప్రపంచం.. తెరపై కనిపించాలనే తపన.. తనను తాను నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు అన్ని మనకు సినిమా రంగంలో కనిపిస్తుంటాయి.  ఒక్క ఛాన్స్... ఒకే ఒక్క ఛాన్స్ నేనేంటో నిరూపించుకుంటా అని చెప్తూ సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగే వ్యక్తులు చాలామంది ఉన్నారు.  ఎంతమందికి అవకాశాలు వస్తున్నాయి.  ఎంతమంది సక్సెస్ అవుతున్నారు.. ఇదంతా వేరే విషయం.  

టెక్నాలజీ అభివృద్ధి చెంది, గ్లోబలైజేషన్ అయ్యాక... సినిమా పరిధి విస్తరించింది.  ప్రాంతీయ సినిమాలు ప్రపంచంలో ప్రతి చోట రిలీజ్ అవుతున్నాయి.  దానికి తగ్గట్టుగా సినిమాలు తీస్తున్నారు. బడ్జెట్ కు ఏ మాత్రం వెనకాడటం లేదు.  సినిమా సక్సెస్ అయితే.. పెట్టిన దానికి నాలుగింతలు వస్తుంది.  ఒకప్పుడు రూ.20 లేదా రూ.30 కోట్ల రూపాయల బిజినెస్ జరిగి, రూ.50 కోట్లు వసూలు చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. 

ఇప్పుడు అంతా మారిపోయింది.  రూ.50 కోట్లు కాదు రూ.100 కోట్లు ఈజీగా వసూలు చేస్తున్నాయి.  పెద్ద సినిమాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.  హీరో క్రేజ్ కు బిజినెస్ కు అలాగే ప్రమోషన్స్ కు తగ్గట్టుగా వసూళ్లు సాధిస్తున్నాయి.  పెట్టిన డబ్బు వెనక్కి తెచ్చుకోవడం ఈజీనే.  వంద కోట్ల క్లబ్ లో చేరడం చాలా సింపుల్ గా మారింది.  విజయ్ దేవరకొండ లాంటి హీరోల సినిమాలు కూడా వందకోట్లు వసూలు చేస్తున్నాయి అంటే అర్ధం చేసుకోవచ్చు.. సినిమా పరిధి ఎంతగా విస్తరించిందో.