మహేష్ బాబు గర్ల్‌ఫ్రెండ్‌ ఈమే !

మహేష్ బాబు గర్ల్‌ఫ్రెండ్‌ ఈమే !

 

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 'మహర్షి' చిత్రం కొంత భాగం న్యూయార్క్ సిటీ బ్యాక్ డ్రాప్లో జరగుతుంది.  ఆ భాగంలో మహేష్ బాబుకు గర్ల్‌ఫ్రెండ్‌ కూడా ఉంటుందట.  ఆమె మరెవరో కాదు 'దూకుడు' చిత్రంలోని టైటిల్ సాంగ్లో మహేష్ బాబుతో కలిసి ఆడిపాడిన మీనాక్షి దీక్షిత్.  హీరోయిన్ గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు, స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ వచ్చింది.  మరి 'మహర్షి' చిత్రమైనా ఆమె కెరీర్ ను మలుపు తిప్పుతుందేమో చూడాలి.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 9న విడుదలకానుంది.