ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపుతామని బెదిరించారంటున్న హీరోయిన్ !

ఎన్టీఆర్ ఫ్యాన్స్ చంపుతామని బెదిరించారంటున్న హీరోయిన్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయింది హీరోయిన్ మీరా చోప్రా. ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆతరవాత తమిళ్ , హిందీ లో సినిమాలు చేసింది. తాజాగా మీరా చోప్రా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ  చాట్ లో మీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు అని ఓ నెటిజన్ అడగగా  సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టమని చెప్పింది. ఇక పవన్ కళ్యాణ్ గురించి ,మాట్లాడుతూ ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అంటూ పొగిడేసింది. ఈ క్రమం లో ఎన్టీఆర్ ఎవరో తెలియదు అంటూ వ్యాఖ్యానించింది. 

తెలుగులో స్టార్ హీరోల్లో తారక్ పేరు లేకుండా ఉండదు. ఆలాంటి ఎన్టీఆర్ ఎవరో తెలియదు అని మీరా చోప్రా అనడంతో అభిమానులు భగ్గుమన్నారు. సోషల్ మీడియా వేదికగా   అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన మీరా చోప్రా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనని ఎలాంటి పదజాలంతో దూషించారో వెల్లడించి ఆవేదన చెందింది. సైబరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. తన తల్లిని ఉద్ధేశించి తిట్టినవి స్క్రీన్ షాట్లలో చూపించింది. ఇలాంటి అభిమానుల వల్ల ఎలా సక్సెసవుతావ్? అని తారక్ ని సైతం ప్రశ్నించింది. నాపై ట్రోల్‌ చేసిన వారి ట్విట్టర్‌ అకౌంట్స్‌ తొలగించాలని  కోరింది. అంతేకాక దీనిపై ఎన్టీఆర్‌ స్పందించాలని కూడా పేర్కొంది.