ఈ పంచ్‌లు ఎవరికి బంగారం?

ఈ పంచ్‌లు ఎవరికి బంగారం?

బంగారం సినిమాలోని మీరా చోప్రా అందరికి తెలిసిన పేరనే చెప్పాలి. ఇటీవల తనపై అనుచిత వాఖ్యలు చేసిన ఓ నేటిజన్‌పై అమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేసి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మిరింది. ఈ వార్తల్ని జాతీయ స్థాయి మీడియా కూడా చూపడంతో ఈమెపై హిందీలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఒక వివాదంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ భామ ఇక అదే పంథాను అనుసరిస్తూ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. తన ఇమేజ్‌ను పెంచుకునేందుకు అనే ప్రయాత్నాలు చేస్తోంది. మీరా ఎంత వైరల్ మోడల్‌గా మారినా ఏ ఒక్కరు ఆమెకు సినిమాల్లో అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయలేదు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా కాస్త ఆదాయాన్ని పొందుతోంది. ఇప్పటివరకు అసలు మీరా అనే ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఉందన్న విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు. వరుస ఫొటోషూట్లు, రకరకాల ఫోజులతో వేడెక్కిస్తూ తన గుర్తింపు పోకుండా కాపాడుకుంటోంది. అంతేకాకుండా అవకాశాల కోసం అనేక మంది నిర్మాతలకు తన ఫీలర్స్‌ని పంపుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల తాజాగా విడుదల చేసిన తన ఫొటోకు కుర్రకాకు ఫిదా అయ్యారు. రెడ్ డ్రస్, బాక్సింగ్ గ్లౌవ్స్‌తో ఆ ఫొలో అదరగోడుతోంది. మరి తన పంచ్‌లు ఎవరి కోసమో తెలియాల్సి ఉంది.