మీరా జాస్మిన్.. రీ ఎంట్రీ!

మీరా జాస్మిన్..  రీ ఎంట్రీ!

అమాయక చూపులతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొంత కాలంగా వెండి తెరకు దూరమైంది. స్వతహాగా మలయాళీ అయిన మీరా జాస్మిన్ సినిమాల్లో అచ్చ తెలుగు అమ్మాయిలా అలరించింది. మీరా కెరీర్ లో చాలా మంది బడా స్టార్స్ సరసన నటించి మెప్పించింది. భద్ర, గుడుంబా శంకర్, పందెం కోడి వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. 2014లో దుబాయ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లి చేసుకుంది. దాదాపు ఆరేళ్లకు పైగా సినిమాలకు గుడ్‌బై చెప్పిన  మీరా జాస్మిన్‌ రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. ప్రముఖ మలయాళీ దర్శకుడు సత్యన్ అంతికాడ్ రూపొందిస్తున్న సినిమాతో మీరా జాస్మిన్‌ మరోసారి వెండితెరపై కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లో మీరా జాస్మిన్‌ నటించనున్నట్లు వెల్లడించారు.