పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూశారా ?

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూశారా ?

పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు.  సినిమా ఎలా ఉంది అన్నది ముఖ్యం కాదు పవన్ తో సినిమా చేస్తే చాలు అనుకునే హీరోయిన్లు చాలామంది ఉన్నారు.  ఆ హీరోయిన్ తెలుగులో చేసింది చాలా తక్కువ సినిమాలే... ఆ తక్కువ సినిమాల్లోనూ పవన్ తో ఓ సినిమా చేసింది.  అదెవరో కాదు మీరా జాస్మిన్.  తమిళంలో పందెంకోడి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న మీరా, తెలుగులో భద్ర సినిమాతో హిట్ కొట్టింది.  

దక్షిణాది భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మీరా, 2014 లో వివాహం చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యింది. ఆ తరువాత మీరా గురించి ఎలాంటి న్యూస్ లేదు.  కాగా, సడెన్ గా మీరా జాస్మిన్ ఇండియాలో ప్రత్యక్షం అయ్యింది.  ఇప్పుడు ఆమెను చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే.  పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యాక అందరు వెయిట్ పెరుగుతారు.  కానీ, మీరా మాత్రం అలాకాదు.  సినిమాల్లో నటించే సమయంలో ఎలా ఉంటె అంతకంటే బ్యూటీగా కనిపించింది.  తన సోదరి వివాహానికి హాజరయ్యేందుకు ఇండియా వచ్చిన మీరాను చూసి అంతా షాక్ అయ్యారు.  మరలా హీరోయిన్ గా ట్రై చేయమని ఆమె అభిమానులు మెసేజ్ చేస్తున్నారట.  మరి మీరా మనసులో ఏముందో.