మెగా డాటర్ వెబ్ సిరీస్ మొదలు.. 

మెగా డాటర్ వెబ్ సిరీస్ మొదలు.. 

మెగా డాటర్ సుష్మితా ఓ వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేయనున్నారు అనే విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఆ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది. సుష్మితా ఆమె భర్త విష్ణుప్రసాద్ కలిసి 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి ప్రవేశిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ప్రకటించారు. దీనికి ఆనంద్ రంగా దర్శకుడు. 'ఓయ్' సినిమా తరవాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సబ్జెక్టు ఇదే. ఇందులో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 'జీ 5' ఓటీటీలో ఈ సిరీస్ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. హైదరాబాద్‌లోని ఓ పోలీస్, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుల కథల ఆధారంగా వాస్తవ ఘటనల ప్రేరణతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందని, అదే కాన్సెప్ట్ అని యూనిట్ తెలిపింది. ఈ రోజు షూటింగ్ ప్రారంభమైన సందర్బంగా నిర్మాత శ్రీమతి సుష్మితా మాట్లాడుతూ... " జీ 5  ఓటీటీ వేదిక మా గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో నిర్మిస్తున్న తొలి వెబ్ సిరీస్ కోసం అసోసియేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ కి ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నారు" అని అన్నారు.ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనాకు అవసరమైన భద్రతా చర్యలతో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోంది.