మెగా బ్రదర్స్ కోసం మెగా కుటుంబం ప్రచారం

మెగా బ్రదర్స్ కోసం మెగా కుటుంబం ప్రచారం

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.  జనసేన పార్టీ తరపున  మెగా బ్రదర్ నాగబాబు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు.  మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.  సోషల్ మీడియా ద్వారా ఎలాగో ప్రచారం చేస్తారు.  అయితే, ప్రత్యక్షంగా ఎవరెవరు ప్రచారం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.  

మెగా హీరోలంతా వారి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు.  అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్, నిహారికలు మెగా హీరో నాగబాబు తరపున ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.  నిహారిక హీరోయిన్ గా చేసిన సూర్యకాంతం సినిమా మార్చి 29 న రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఈ సినిమా రిలీజ్ తరువాత నిహారిక తండ్రి తరపున ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నది.  మరోవైపు వరుణ్ తేజ్ కూడా ప్రచారం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.  ప్రస్తుతం అమెరికాలో ఉన్న వరుణ్, మరో వారంలో ఇండియాకు వస్తాడట.  వచ్చిన తరువాత తండ్రి తరపున ప్రచారంలో పాల్గొంటాడని తెలుస్తోంది.