చిరు ప్రచారంపై క్లారిటీ

చిరు ప్రచారంపై క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా బిజీలో ఉన్నాడు.  ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నటిస్తున్నారు మెగాస్టార్.  కొంత గ్యాప్ దొరకడంతో మెగాస్టార్ శ్రీమతితో కలిసి జపాన్ వెళ్లి అక్కడ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.  

మెగాస్టార్ జపాన్ నుంచి తిరిగిరాగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి.  చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తరపున మెగాస్టార్ ప్రచారం చేయబోతున్నారని వస్తున్న వార్తలపై మెగా కుటుంబం స్పందించింది.  

2019 లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మెగాస్టార్ ఏ పార్టీ తరపున ప్రచారం చేయడం లేదని, ఎన్నికల ప్రచారానికి మెగాస్టార్ దూరంగా ఉంటున్నాడని మెగా కుటుంబంలోని వ్యక్తులు పేర్కొన్నారు.