పవన్ కోసం కదిలిన మెగా ఫ్యామిలీ!

పవన్ కోసం కదిలిన మెగా ఫ్యామిలీ!
వరుస ట్వీట్లతో అటు పొలిటికల్‌గా, ఇటు సినీ ఇండస్ట్రీతో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపిన పవన్ కల్యాణ్... న్యాయపోరాటానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. నల్ల దుస్తులు ధరించి హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్న పవన్... న్యాయవాదుల సమావేశమయ్యారు. కాగా, పవన్‌కు మద్దతుగా ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకోగా... కొంతకాలంగా పవన్‌కు దూరంగా ఉంటున్న అల్లు అర్జున్ కూడా ఫిల్మ్ ఛాంబర్ చేరుకోవడం విశేషం... ఇక 'మా' శివాజీ రాజా, నరేష్‌, వరుణ్ తేజ్ కూడా ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకోగా మెగా పవన్ స్టార్ రాంచరణ్‌, ప్రభాస్ కూడా ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చే అవకాశం ఉందంటున్నారు. 5 7