మెగా సందడి షురూ.. రికార్డులు ఎన్ని బద్దలౌతాయో..!!

మెగా సందడి షురూ.. రికార్డులు ఎన్ని బద్దలౌతాయో..!!

మెగాస్టార్ చిరంజీవికి సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.  స్వయంకృషితో పైకి ఎదిగిన వ్యక్తి.  చిరంజీవి డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అవుతుంటారు.  ఓ చారిత్రాత్మక కథతో సైరాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ మెగాస్టార్ పుట్టినరోజుకు ఒకరోజు ముందుగానే రిలీజ్ చేస్తున్నారు.  దీంతో అభిమానుల్లో అప్పుడే సందడి మొదలైంది.  సోషల్ మీడియాలో మెగాస్టార్ బర్త్ డే ట్యాగ్ ను ట్రేండింగ్ చేస్తున్నారు.  టీజర్ రిలీజ్ కాగానే, యూట్యూబ్ లో వ్యూస్ న పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది చిరంజీవి ఫ్యాన్స్.  ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైన వెంటనే యూట్యూబ్ లో రికార్డులు బద్దలు ఖావడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.  కొన్ని చోట్ల ఈ టీజర్ ను ఎల్ఈడి తెరలపై వీక్షించేందుకు ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్స్ ను బుక్ చేసుకొని ఫ్యాన్స్ అక్కడ ప్రదర్శించేవిధంగా ప్లాన్ చేస్తున్నది.