చిరంజీవి చెప్పిన సినిమా స్టోరీ.. అనగనగా 60 ఏళ్ళ క్రితం.. 

చిరంజీవి చెప్పిన సినిమా స్టోరీ.. అనగనగా 60 ఏళ్ళ క్రితం.. 

అనగనగా ఓ ఊరు... ఆ ఊరిలో పెళ్ళైన కొత్త జంట.. ఆమె గర్భవతి.  గర్భవతిగా ఉన్న మహిళ సినిమాకు తీసుకెళ్ళమని కోరింది.  భార్య కోరిక మేరకు ఆమెను గుర్రం బండిలో కూర్చోపెట్టుకొని సినిమాలు వెళ్తున్నారు.  మధ్యలో రోడ్డు బాగాలేదు.  ఆ గతుకుల్లో బండి అటుఇటు కదలడంతో.. ఆ మహిళ ఇబ్బంది పడింది.  

భార్య బాధను చూడలేక వెనక్కి వెళదాం అన్నాడు.  కానీ, ఆ మహిళ మాత్రం సినిమా చూడాలని కోరింది.  అలా గర్భిణిని తీసుకొని సినిమాకు వెళ్లారు.  ఆ సినిమా రోజులు మారాయి.  అక్కినేని నాగేశ్వర రావు హీరో.  కట్ చేస్తే.. ఆ తల్లి నుంచి వచ్చి వచ్చిన బిడ్డ ఈరోజు హీరోగా ఇండస్ట్రీలో నిలబడ్డాడు.  ఆ బిడ్డ ఎవరో కాదు.. నేనే అని చిరంజీవి చెప్పడంతో అందరు షాక్ అయ్యారు.  మెగాస్టార్ జీవితంలో జరిగిన ఈ కథ గురించి ఎవరికీ తెలియదు.  సినిమా స్టోరీని తలపించిన ఈ కథ విని అందరు ఆశ్చర్యపోయారు.