మెగాస్టార్ కోసం ఎదురుచూపుల్లో అభిమానులు !

మెగాస్టార్ కోసం ఎదురుచూపుల్లో అభిమానులు !

ఈరోజు మెగా అభిమానులకు పండుగ రోజనే చెప్పాలి.  ఎందుకంటే మెగాస్టార్ చిరు నటిస్తున్న 'సైరా' చిత్ర టీజర్ ఈరోజే విడుదలవుతోంది.  ఉదయం 11 గంటల 30 నిముషాలకు రానున్న ఈ టీజర్ కోసం  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యావత్ తెలుగు ప్రేక్షక లోకం నరసింహారెడ్డి గెటప్లో చిరు ఎలా  ఉంటారో చూడాలని తెగ ఉబలాటపడుతున్నారు. 

2017లో 'ఖైదీ నెం 150'తో రీ ఎంట్రీ ఇచ్చి 100 కోట్లు కొల్లగొట్టి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసి చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ చిత్రంపై  ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి.  సురేందర్ రెడ్డి ఎంతో పకడ్బంధీగా రూపొందిస్తున్న ఈ సినిమా అత్యున్నత సాంకేతిక విలువలతో ఉండనుంది.