ఆ స్కూల్ కోసం మెగాహీరో భారీ విరాళం..

ఆ స్కూల్ కోసం మెగాహీరో భారీ విరాళం..

కొన్నిరోజుల క్రితం వరకు సెలెబ్రిటీలు ఊర్లను, స్కూల్స్ ను దత్తత తీసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చేవి.  ఇటీవల కాలంలో ఆ వార్తలు తగ్గిపోయాయి.  తీసుకున్న గ్రామాలను అభివృద్ధి చేస్తూ బిజీగా ఉన్నారు సెలెబ్రిటీలు.  మెగాహీరోల్లో చాలామంది గ్రామాలను దత్తత తీసుకొని వాళ్లకు తోచినంతగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.  

ఈ లిస్ట్ లో సాయి ధరమ్ తేజ్ కూడా ఉండటం విశేషం.  సాయి ధరమ్ తేజ్ అక్షరాలయ అనే స్కూల్ ను దత్తత తీసుకున్నారు.  ఆ స్కూల్ లో చదువుతున్న 100 మంది విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలను సాయి ధరమ్ ఏర్పాటు చేస్తున్నారు.  థింక్ పీస్ అనే సంస్థ ద్వారా సాయి ధరమ్ తేజ్ ఈ స్కూల్ ను దత్తత తీసుకున్నారట.  గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ద్వారా గెలుచుకున్న మొత్తాన్ని సాయి ధరమ్ ఈ స్కూల్ కోసం వినియోగించిన సంగతి తెలిసిందే.