దేవదాస్ కు షాకిచ్చిన రామ్ చరణ్ విలన్

దేవదాస్ కు షాకిచ్చిన రామ్ చరణ్ విలన్

రక్త చరిత్ర సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన వ్యక్తి వివేక్ ఒబెరాయ్.  బాలీవుడ్ స్టార్ నటుడు రామ్ గోపాల్ వర్మ సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు.  రక్త చరిత్ర మంచి విజయం సాధించడంతో వివేక్ కు మంచి పేరు వచ్చింది.  ఆ తరువాత వివేక్ తెలుగులో నటించలేదు.  ఇప్పుడు రామ్ చరణ్.. బోయపాటి సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు.  భారీ బడ్జెట్ తో రూపొండుతున్న ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు వివేక్ ఒబెరాయ్ రూ.1.25 కోట్లు డిమాండ్ చేశాడట.  భారీ బడ్జెట్ సినిమా పైగా వివేక్ లాంటి వ్యక్తి నటిస్తే సినిమాకు మరింత హైప్ వస్తుంది అనే ఉద్దేశ్యంతో ఒకే చేశారు.  

రామ్ చరణ్ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఈ నటుడిని ఇటీవలే దేవదాస్ టీమ్ సంప్రదించిందట.  దేవదాస్ లో విలన్ రోల్ ను ఆఫర్ చేశారట.  దేవదాస్ లో విలన్ రోల్ కు ప్రాధాన్యత ఉండటంతో బాలీవుడ్ నటుడైతే బాగుంటుందనే ఉద్దేశ్యంతో వివేక్ ను అప్ప్రోచ్ అయ్యారు.  దేవదాస్ లో విలన్ గా నటించేందుకు వివేక్ రూ.2.5 కోట్లు డిమాండ్ చేశాడట.  వివేక్ భారీ మొత్తంలో డిమాండ్ చేయడంతో.. దేవదాస్ టీమ్ షాక్ తిన్నది.  వివేక్ లాంటి మరో విలన్ కోసం దేవదాస్ టీమ్ సెర్చ్ చేస్తున్నది.