చిరు ఇది నిజమా... అప్పుడే కొనేశారా!!?

చిరు ఇది నిజమా... అప్పుడే కొనేశారా!!?

చిరంజీవి 152 వ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.  కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.  యూనివర్సల్ సబ్జెక్టుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.  దేవాలయాలకు సంబంధించిన కథ కావడంతో సినిమాపై నమ్మకం పెట్టుకున్నారు.  సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.  

మణిశర్మ ఇప్పటికే మూడు ట్యూన్స్ ఇచ్చారట.  ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాల హిట్ తరువాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు క్రేజ్ పెరిగింది.  దీంతో ఈ సినిమా నైజాం రైట్స్ ను దిల్ రాజు అప్పుడే తీసేసుకున్నారని టాక్ వినిపిస్తోంది.  రైట్స్ ఎంత ఏంటి అనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు.  ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.