మెగాస్టార్ హీరోయిన్ కూతురు పేరు ఇదే..!!

మెగాస్టార్ హీరోయిన్ కూతురు పేరు ఇదే..!!

గత పదిహేనేళ్ల క్రితం టాలీవుడ్ కు ఎన్టీఆర్ మూవీ నరసింహుడు సినిమాతో పరిచయం అయ్యింది.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.  అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ సినిమాతో పరిచయం అయ్యింది.  ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో... వరుసగా సినిమా ఆఫర్లు వస్తాయని అనుకుంది.  మరుసటి ఏడాది ఎన్టీఆర్ తో అశోక్ సినిమా చేసింది.  ఈ సినిమా కూడా భారీ ప్లాప్ అయ్యింది.  ఆ తరువాత కొన్నాళ్ళకు సినిమా ఇండస్ట్రీకి బై బై చెప్పి ముంబై వ్యాపారవేత్తను వివాహాం చేసుకొని సెటిల్ అయ్యింది.  

2014 లో వివాహం చేసుకున్న సమీరా రెడ్డికి 2015 వ సంవత్సరంలో హన్స్ అనే బాబు పుట్టారు.  అనంతరం 2019 లో ఓ పాపకు జన్మను ఇచ్చింది సమీరా రెడ్డి.  సమీరా కూతురు పేరును నైరా అని పెడుతున్నట్టు ప్రకటించింది.  పేరుతో కూడిన ఫోటోను సమీరా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  సినిమాలకు దూరంగా ఉన్నా, సమీరా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు బిజీగా ఉంటోంది.