#RRR ప్రారంభోత్సవ వేడుకకు ఎవరెవరు వస్తున్నారో తెలుసా..?

#RRR ప్రారంభోత్సవ వేడుకకు ఎవరెవరు వస్తున్నారో తెలుసా..?

బాహుబలి తరువాత రాజమౌళి చేపడుతున్న భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్.  ఇది సినిమా టైటిల్ కాదు.  వర్కింగ్ టైటిల్ మాత్రమే.  ఈ సినిమా నవంబర్ 11 న ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతున్నది.  ఈ వేడుకకు బాహుబలి హీరో ప్రభాస్ ముఖ్య అతిధిగా వస్తున్న సంగతి తెలిసిందే.  బాహుబలి ఒక్కడే అనుకుంటే పొరపాటే.  

ప్రభాస్ తో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరువుతున్నట్టు సమాచారం.  రామ్ చరణ్ తరపున మెగాస్టార్, ఎన్టీఆర్ తరపున బాలకృష్ణను యూనిట్ ఆహ్వానించినట్టుగా తెలుస్తున్నది.  వీరితో పాటు రానా, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, దిల్ రాజు తో పాటు సినిమా రంగానికి చెందిన మరికొందరు ప్రముఖులు కూడా హాజరవుతున్నారట.  మొత్తంగా 11 మంది అతిధులకు తగ్గకుండా చూసుకుంటున్నట్టు సమాచారం.