సైరా బిజీలో ఉన్నా... వరుణ్ కోసం మెగాస్టార్..!!! 

సైరా బిజీలో ఉన్నా... వరుణ్ కోసం మెగాస్టార్..!!! 

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సినిమాను ప్రమోషన్ చేసే బిజీలో ఉన్నాడు మెగాస్టార్.  అసలే భారీ బడ్జెట్ సినిమా.. ప్రమోషన్ చేయాల్సిన అవసరం చాలా ఉన్నది.  బాలీవుడ్ లో ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఉన్నది.  అక్కడ ప్రమోషన్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతున్నది.  

దాంతో పాటు సౌత్ లో కూడా సినిమాను ప్రమోషన్ చేయాలి.  మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో సినిమాను ఎలా ప్రమోట్ చేయాలా అని ఆలోచనలో పడింది.  ఇలా బిజీగా ఉన్నా కూడా మెగాస్టార్ అబ్బాయి వరుణ్ కోసం కొంత సమయాన్ని కేటాయించారు. నిన్నటి రోజున మెగాస్టార్ చిరంజీవి అబ్బాయి సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం అబ్బాయిని మెచ్చుకున్నారు.  గద్దలకొండ గణేష్ యూనిట్ కు స్పెషల్ గా శుభాకాంక్షలు తెలియజేశారు.