ఓటు హక్కును వినియోగించుకున్న చిరంజీవి, రామ్ చరణ్

ఓటు హక్కును వినియోగించుకున్న చిరంజీవి, రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.  ఓటు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అని చెప్పారు.  సరైన అభ్యర్థిని ఎంచుకోవాలని ఈ సందర్భంగా రామ్ చరణ్ చెప్పారు.  

మెగాస్టార్ ప్రస్తుతం సైరా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.  మరోవైపు రామ్ చరణ్ ... ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నాడు.చరణ్ కు గాయం కావడంతో షూటింగ్ మూడు వారాల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.