ఉయ్యాలవాడ క్లైమాక్స్ లో చిరు ఇలా కనిపిస్తాడట..!!

ఉయ్యాలవాడ క్లైమాక్స్ లో చిరు ఇలా కనిపిస్తాడట..!!

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నది.  ఇటీవలే జార్జియాలో షూటింగ్ ముగించుకొని ఇండియాకు తిరిగి వచ్చారు.  జార్జియాలో క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేసినట్టుగా తెలుస్తున్నది.  

ఈ సినిమాలో బ్రిటిష్ సైన్యం క్లైమాక్స్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టుకొని ఉరి తీస్తారు.  ఉయ్యాల స్పూర్తితో బ్రిటిష్ దొరలపై తిరుగుబాటును తీసుకొచ్చిన కొందరు విప్లవకారుల సన్నివేశాలతో సినిమా ముగుస్తుంది.  ఉయ్యాలవాడ తరువాత ఆయన స్పూర్తితో తెల్లదొరలపై పోరాటం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు.  ఆయన గెటప్ లో చిరంజీవి క్లైమాక్స్ లో కనిపించబోతున్నారనే సమాచారం.  

రామ్ చరణ్ తేజ్ నిర్మాణంలో దాదాపు రూ.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నది.  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  సమ్మర్ స్పెషల్ గా సినిమా రాబోతున్నది.  నయనతార, తమన్నా, అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వంటి భారీతారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతున్నది.