అమ్మే అతిపెద్ద గిఫ్ట్ అంటున్న మెగాస్టార్

అమ్మే అతిపెద్ద గిఫ్ట్ అంటున్న మెగాస్టార్

మెగాస్టార్ బర్త్ డే సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా సైరా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  మెగా బర్త్ డే రోజునే తనయుడు రామ్ చరణ్.. బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ను రిలీజ్ చేస్తారని సమాచారం. 

ఇదిలా ఉంటె, ఈ బర్త్ డే కి ఓ స్పెషల్ ఉందట.  ఆ స్పెషల్ ఏంటో కాదు మెగాస్టార్ తల్లి అంజనాదేవిగారే. తల్లి అంటే చిరంజీవికి ఎంత ఇష్టమో చెప్పలేం.  అనేకసార్లు తన తల్లి గురించి, ఆమెపై తనకున్న ప్రేమను గురించి చెప్పారు.  గత కొంతకాలంగా ఉంటున్న ఇల్లు మరమ్మత్తులు జరుగుతున్నందువలన, అంజనాదేవి మరో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారట.  ఇటీవలే ఫోన్ చేసి ఒంటరిగా ఉండలేను వచ్చేస్తానని చెప్పడంతో.. మెగాస్టార్ వెంటనే తల్లిని ఇంటికి తీసుకొచ్చేశారట.  తన బర్త్ డే గిఫ్ట్ అమ్మే అని, అంతకంటే పెద్ద గిఫ్ట్ మరేముంటుందని అంటున్నారు మెగాస్టార్.