గీత గోవిందం సక్సెస్ మీట్ చీఫ్ గెస్ట్ గా చిరంజీవి

గీత గోవిందం సక్సెస్ మీట్ చీఫ్ గెస్ట్ గా చిరంజీవి

విజయ్ దేవరకొండ గీత గోవిందం మంచి సక్సెస్ సాధించింది.  మూడు రోజుల్లోనే రూ.35 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.  విడుదలైన అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్నది.  లాంగ్ రన్ ఈ సినిమా ఎంత వసూలు చేస్తుంది అనేదానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.  ఈ సినిమాను ప్రత్యేకంగా చూసి అభినందనలు తెలిపిన చిరంజీవి, ఈ సినిమా సక్సెస్ మీట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టుగా సమాచారం.  

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరుకావాల్సి ఉన్నా.. సైరా షూటింగ్ లో బిజీగా ఉండటం వలన హాజరుకాలేకపోయారు.  కాగా, ఆగష్టు 19 వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగే గీత గోవిందం సక్సెస్ మీట్ కు చిరు హాజరవుతున్నారట.  యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ సక్సెస్ మీట్ జరగనున్నది.