'వకీల్ సాబ్' దర్శక నిర్మాతలకు మెగాభినందనలు

'వకీల్ సాబ్' దర్శక నిర్మాతలకు మెగాభినందనలు

మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం సాయంత్రం తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఏఎంబీ లో తమ్ముడు పవన్ కళ్యాణ్‌ 'వకీల్ సాబ్' మూవీని చూశాడు. సినిమాపై తన అభిప్రాయాన్ని కూడా ట్వీట్ రూపంలో తెలిపాడు. అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరుపై తనదైన శైలిలో స్పందించారు. విశేషం ఏమంటే... ఈరోజు ఈ చిత్రం నిర్మాత దిల్ రాజును, దర్శకుడు వేణు శ్రీరామ్ ను చిరంజీవి తన ఇంటికి పిలిపించుకున్ని మరీ వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. 'వకీల్ సాబ్' మూవీలో తనకు నచ్చిన, తన ఫ్యామిలీ సభ్యులు మెచ్చిన సన్నివేశాలను వారిరువురికీ చిరంజీవి తెలియచేశారు. మొన్న నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీని ప్రెస్ మీట్ పెట్టిమరీ అభినందించిన మెగాస్టార్... త్వరలో 'వకీల్ సాబ్' విషయంలోనూ అదే పనిచేస్తారేమో చూడాలి. సహజంగా తన సినిమాల సక్సెస్ మీట్, ప్రెస్ మీట్స్ కు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్‌ ఈ మూవీ విషయంలో ఆ నిబంధనను పక్కన పెట్టి పాల్గొంటారేమో!