చిరు ఢిల్లీ టూర్.. ఉపరాష్ట్రపతి ఇంట్లో సైరా ప్రదర్శన..!!

చిరు ఢిల్లీ టూర్.. ఉపరాష్ట్రపతి ఇంట్లో సైరా ప్రదర్శన..!!

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఢిల్లీ వెళ్లారు.. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, సీఎం రమేష్ తో కలిసి అయన ఢిల్లీ వెళ్లారు.  ఢిల్లీ వెళ్లిన చిరంజీవి మొదట ప్రధాని మోడీని కలవబోతున్నారు.  మోడీ ప్రధాని అయ్యాక మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఆయన్ను కలవలేదు.  2014లో మోడీ గెలిచిన సమయంలో మెగాస్టార్ రాజ్యసభ మెంబెర్ గా ఉన్నారు.  2019లో మోడీ ప్రధాని అయినపుడు.. మెగాస్టార్ సినిమాల్లో బిజీ అయ్యారు.  

ఇప్పుడు సినిమాపై ఎక్కువ దృష్టిపెట్టారు.  అయితే, మెగాస్టార్ ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఈ విషయాన్ని చిరంజీవి కూడా చెప్పారు.  కానీ, తాను ప్రస్తుతం సినిమాల్లోనే ఉంటానని అన్నారు.  కాగా, ఇప్పుడు సైరా సినిమా ప్రమోషన్స్ కోసం బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, సీఎం రమేష్ లతో కలిసి ఢిల్లీ వెళ్లారు.  మొదట మోడీని కలుస్తారు.  అనంతరం అమిత్ షాను కలవబోతున్నారు.  ఈ ఇద్దరు నేతలను కలిసి సైరా సినిమా గురించి వివరించనున్నారు.  సినిమా చూడాల్సిందిగా కోరబోతున్నారు.  అనంతరం అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి ఇంటికి వెళ్లి అక్కడ సైరా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు.  మోడీ, అమిత్ షా లో ఒకరు లేదా ఇద్దరు సైరా సినిమా ప్రదర్శనకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.