చిరు కొత్త సినిమాపై ప్రకటన అప్పుడే...

చిరు కొత్త సినిమాపై ప్రకటన అప్పుడే...

మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’తో రీఎంట్రీ ఇచ్చి సైరా తో మెగాహిట్ అందుకున్నాడు. ఈ సినిమాను యువ దర్శకుడు సురేందర్ రెడ్డికి తెరకెక్కించాడు. ఇక ప్రస్తుతం స్టార్ దర్శకుడు కొరటాల శివతో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా బాధ్యతలు సాహో దర్శకుడు సుజిత్ కు అప్పగించాడు. ఇక కొన్ని రోజులుగా తమిళ్ లో అజిత్ నటించిన ''వేదాళం'' సినిమాను తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా మెగాస్టార్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫామ్ అయ్యిందట. ఇక ఈ సినిమా పై అధికారిక ప్రకటన మెగాస్టార్ పుట్టినరోజు ఆగష్టు 22న అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను నిర్మాత అనీల్ సుంకర మరియు రామ్ చరణ్ లు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం.