మొదలుకానున్న లూసిఫర్ రీమేక్.. ఎప్పుడంటే..

మొదలుకానున్న లూసిఫర్ రీమేక్.. ఎప్పుడంటే..

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణలో ఉన్న చిరు దీని తర్వాత మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టిన విషయం తెలసిందే. ఆచార్య తర్వాత వేదాళం, లూసిఫర్ సినిమాలను రేమెక్ చేసేందుకు చిరు అన్ని విధాల సన్నద్దంగా ఉన్నాడు. అయితే మొదటగా ఆచార్య పూర్యయిన వెంటనే వేదాళం సినిమా ప్రారంభించనున్నారు. కానీ చిరు వేదాళం కన్నా లూసిఫర్ సినిమాకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉన్నాడు. అందుకేనేమో వేదాళం కన్నా ముందుగా లూసిఫర్‌ను మొదలు చేయనున్నాడట. అయితే లూసిఫర్ సినిమా ఈ నెల 21 నుంచి చిత్రీకరణను ప్రారంబించనున్నారట. ఇప్పటికే సినిమా మేకర్స్ లూసిఫర్‌ను సంక్రాంతి తరువాత మొదలు చేయనున్నట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే లూసిఫర్‌ను స్టార్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రీమేక్ కింగ్ మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం వేచి చూడాల్సిందే.