రేపు ఏపీ సీఎం తో మెగాస్టార్ భేటీ...కారణం..

రేపు ఏపీ సీఎం తో మెగాస్టార్ భేటీ...కారణం..

మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా టాలీవుడ్లో మంచి విజయం సాధించింది.  మిగతా భాషల్లో పెద్దగా హిట్ కాలేకపోయినా.. తెలుగులో మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.  మెగాస్టార్ నటనను ప్రతి ఒక్కరు మెచ్చుకున్తున్నారు.  కాగా, టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు సినిమాను చూసి మెచ్చుకుంటూ ఇప్పటికే ట్వీట్ చేస్తూ వచ్చారు.  తెలంగాణ గవర్నర్ కూడా ఈ సినిమాను చూసి బాగుందని మెచ్చుకున్నారు.  

ఇదిలా ఉంటె, రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మెగాస్టార్ చిరంజీవి కలవబోతున్నారు.  మెగాస్టార్ కు వైఎస్ జగన్ అపాయింట్మెంట్  ఇచ్చినట్టు తెలుస్తోంది.  సైరా హీరో మెగాస్టార్ చిరంజీవి, నటుడు, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు వైఎస్ జగన్ ను కలవబోతున్నారు.  సైరా సినిమాకు సంబంధించిన విషయాల గురించి ముఖ్యమంత్రితో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది.