రాజకీయాల గురించి చిరంజీవి ఆలోచన ఇలా ఉంది..!!

రాజకీయాల గురించి చిరంజీవి ఆలోచన ఇలా ఉంది..!!

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన తరువాత ఏడేళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.  ఏడేళ్లు గ్యాప్ తీసుకొని తిరిగి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.  ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సైరా సినిమా బిజీలో ఉన్నారు మెగాస్టార్.  సైరా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.  

ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను ఇటీవలే రిలీజ్ చేశారు.  అయితే, సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు పంచుకున్నారు.  ముఖ్యంగా రాజకీయాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది.  పార్టీలో చేరాలని ఓ పార్టీ ఆహ్వానించిన విషయం గురించి అడిగితే.. అది పూర్తిగా వాళ్ళ ఆలోచన.. వారి ఆశ.  దానిపై తాను ఎలా స్పందిస్తానని అన్నారు.  తన దృష్టి ప్రస్తుతానికి సినిమాలపై మాత్రమే ఉందని అన్నారు మెగాస్టార్.