సైరా కోసం 22 మంది 5నెలల పాటు..!!!

సైరా కోసం 22 మంది 5నెలల పాటు..!!!

మెగాస్టార్ చిరంజీవి మూవీ అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి.  సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ షురూ కాబోతున్నాయి. సినిమా రిలీజ్ కు దగ్గరపడుతుండటంతో ఈ మూవీకి సంబందించిన ఎలాంటి చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  

మెగాస్టార్ చిరంజీవి 64 గ్రామాలకు రాజు.  ఆ గ్రామాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.  కొన్ని గ్రామాలను సెట్స్ రూపంలో వేశారట. అలానే కొన్నింటిని విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించబోతున్నారట. అలానే ఈ మూవీ కోసం మొత్తం 42సెట్స్ వేసినట్టు ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ పేర్కొన్నారు.  ఇందులో 15 సెట్స్ భారీ సెట్స్ అని అయన తెలిపారు.  200 ఏళ్ళనాడు ఎలాంటి దుస్తులు వేసుకున్నారు.. అనే దానిపై పరిశోధన చేసి.. 22 మంది టైలర్లు దాదాపు 5 నెలలపాటు కష్టపడి 15వేల దుస్తులు తయారు చేసినట్టు ఆయన తెలిపారు.  ఈ కష్టం మొత్తం సినిమాలో కనిపిస్తుందని అంటున్నాడు.