శంకర్ దర్శకత్వంలో చిరంజీవి

శంకర్ దర్శకత్వంలో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కేరళలో సైరా షూటింగ్ బిజీలో ఉన్నాడు.  పదిరోజులపాటు అక్కడ షూటింగ్ జరుగుతుంది.  అనంతరం హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుంది.  దీని తరువాత మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తారు.  ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా ఉంటుంది.  ఈ రెండు సినిమాల తరువాత మెగాస్టార్... భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి.  

గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుందట.  దీనికి సంబంధించిన ప్రాధమిక చర్చలు కూడా జరిగినట్టు సమాచారం.  తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమాలో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తే... తమిళంలో అజిత్ లేదా విజయ్ నటిస్తారని తెలుస్తోంది. ఇది మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.