హ్యాపీ మూడ్ లో చిరు.. ఎందుకంటే..!! 

హ్యాపీ మూడ్ లో చిరు.. ఎందుకంటే..!! 

చిరంజీవి 151 వ సినిమా సైరా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది.  ఈ సినిమా కోసం ఏకంగా మెగాస్టార్ రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డారు.  భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా అదే రేంజ్ లో వసూలు సాధించింది.  ఇప్పటి వరకు ఈ మూవీ దాదాపుగా రూ. 135 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.  

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి.  కాగా, తన 152 వ సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది.  నవంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది.  ఇక ఇదిలా ఉంటె, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రిలాక్స్ మూడ్ లో ఉన్నారు. నెక్స్ట్ సినిమా షూటింగ్ కు కాస్త సమయం దొరకడంతో ఇంట్లో పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్.