చిరంజీవి మరో సీక్రెట్ చెప్పేశారు.. ఎప్పటికైనా చేస్తారేమో..!! 

చిరంజీవి మరో సీక్రెట్ చెప్పేశారు.. ఎప్పటికైనా చేస్తారేమో..!! 

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు 151 సినిమాలు పూర్తి చేశారు.  152 వ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.  సినిమా ఇండస్ట్రీకి ఏడేళ్లు దూరంగా ఉన్న చిరంజీవి తన 150 వ సినిమాగా సైరా చేద్దామని అనుకున్నా, దాన్ని కావాలని పక్కన పెట్టారట.  ఎందుకంటే, రాజకీయాల్లోకి వెళ్ళకముందు మెగాస్టార్ అంటే ప్రేక్షకుల్లో ఒక భావన ఉండేది.  మాస్ ను అలరించే డైలాగులు, స్టెప్స్, ఫైట్స్ ఉంటాయి.  

 

అందుకోసమే 150వ సినిమాగా ఖైదీ నెంబర్ 150 చేశారట.  151 వ సినిమాగా సైరా చేయాలి అనుకున్నప్పుడు దర్శకుడు ఎవరైతే బాగుంటుందని అనుకుంటుంటే.. పరుచూరి బ్రదర్స్ చిరంజీవినే దర్శకత్వం వహించమని చెప్పారని మెగాస్టార్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.  తనకు దర్శకత్వం వహించే సత్తా ఉన్నా.. నటిస్తూ.. అంతమందిని కోఆర్టినేట్ చేసుకుంటూ డైరక్షన్ చేయడం అంటే కష్టం అని హీరోగా ఎవరైనా ఉంటె.. తాను దర్శకత్వం వహిస్తానని మెగాస్టార్ త్రివిక్రమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు.  ఆ తరువాత కొన్ని నాటకీయ పరిణామాల తరువాత సురేందర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.  చిరంజీవి మనసులో సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక బలంగా ఉన్నది.  భవిష్యత్తులో మెగాస్టార్ దర్శకత్వం వహిస్తారేమో చూడాలి.