మెగాస్టార్ పుట్టినరోజున మరో సర్ప్రైజ్ ఇస్తారట

మెగాస్టార్ పుట్టినరోజున మరో సర్ప్రైజ్ ఇస్తారట

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా వచ్చి రెండేళ్లయింది.  ఈ సినిమా తరువాత మెగాస్టార్ చేస్తున్న సినిమా సైరా.  చారిత్రాత్మక నేపధ్యం కలిగిన సినిమా కావడంతో ఎక్కువ సమయం పట్టింది.  గత రెండేళ్లుగా షూట్ చేస్తున్నారు.  ఇంకా కొద్దిభాగం షూటింగ్ మిగిలిపోయింది.  మిగిలిన భాగాన్ని పూర్తి చేసి... పోస్ట్ ప్రొడక్షన్స్ వర్స్క్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారు.  

సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను దసరా సీజన్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.  అక్టోబర్ 2 వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది.  దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వెలువడలేదు.  ఒకవేళ సినిమా దసరాకు రాకుంటే... సంక్రాంతికి రావాలి.  అప్పటి వరకు సినిమాను పోస్ట్ ఫోన్ చేయకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సినిమాను పక్కాగా దసరాకు రెడీ చేస్తున్నారు.  దీనిని సంబంధించిన కీలకమైన న్యూస్ మెగాస్టార్ పుట్టినరోజైన ఆగష్టు 22 వ తేదీన ప్రకటిస్తారని సమాచారం.