కేరళ అడవుల్లో మెగా పోరాటాలు

కేరళ అడవుల్లో మెగా పోరాటాలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సైరా మూవీ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది.  కొన్ని ఫైట్ సీన్స్ మిగిలి ఉన్నాయి.  ప్రస్తుతం వీటి షూటింగ్ ను యూనిట్ ప్లాన్ చేసింది.  ఇందులో కొన్ని సీన్స్ ను కేరళలోని అందమైన అడవుల్లో షూట్ చేస్తున్నారు.  దాదాపు పది రోజులపాటు కేరళలోని అడవుల్లో ప్లాన్ చేసింది యూనిట్. 

అక్కడ పదిరోజుల షెడ్యూల్ పూర్తికాగానే హైదరాబాద్ షెడ్యూల్ లో మిగిలిన షూటింగ్ ను పూర్తి చేస్తారట.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్.  అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు.  హైదరాబాద్ షెడ్యూల్ తరువాత పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ స్టార్ట్ చేస్తారట.  విఎఫ్ఎక్స్ వర్క్స్ కు ఎక్కవ సమయం తీసుకుంటారని తెలుస్తోంది.