భయపెడుతున్న సైరా రన్ టైమ్..!!

భయపెడుతున్న సైరా రన్ టైమ్..!!

మెగాస్టార్ హీరోగా చేస్తున్న సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  మరో 28 రోజుల్లో సినిమా థియేటర్లలో సందడి చేయబోతున్నది.  ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  సినిమాను పూర్తిగా ఎడిట్ చేయగా ఫైనల్ గా రన్ టైం 2గంటల 45 నిమిషాల వరకువచ్చింది.  ఒకరకంగా చెప్పాలి అంటే అది పెద్ద సినిమానే. మామూలు సినిమాలకు ఈ స్థాయిలో రన్ టైమ్ అంటే బోర్ గా ఫీలవ్వొచ్చు.  కానీ, సైరా చారిత్రాత్మక కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. రన్ టైమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

ఏదైనా అనవసరమైన కంటెంట్ ఉంటె తీసేయాలని ఇప్పటికే మెగాస్టార్ నుంచి ఆర్డర్లు వచ్చినట్టు తెలుస్తోంది.  బల్గెరియాలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.  సినిమా విషయంలో రాజీపడొద్దని ఇప్పటికే స్పష్టం చేశారు.  సినిమా అనుకున్నట్టుగా రావాలని, దానికోసం ఒకటికి రెండుసార్లు చూసి ఎడిట్ చేయాలని చెప్పారట. ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఈ సినిమాకు కోతలు పెడతారో లేదంటే అలానే ఉంచుతారో చూడాలి.