దూకుడు పెంచిన మెగాస్టార్.. నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలి.. 

దూకుడు పెంచిన మెగాస్టార్.. నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలి.. 

మెగాస్టార్ చిరంజీవి దూకుడు పెంచుతున్నాడు.  సైరా పూర్తి చేసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన 152 వ సినిమాను స్టార్ట్ చేశారు.  దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.  ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నది.  ఈ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తైన వెంటనే షూటింగ్ మొదలౌతుంది.  షూటింగ్ స్టార్ట్ చేసిన నాలుగు నెలల్లోపుగా సినిమాను పూర్తి చేయాలని మెగాస్టార్ పట్టుబడుతున్నారు.  

నాలుగు నెలల్లో సినిమా పూర్తిచేసి, వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్.  నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలి అంటే మామూలు విషయం కాదు.  అన్ని పక్కాగా ప్లాన్ చేయాలి.  ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకూడదు.  మరి దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను అనుకున్న విధంగా నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తారా.. ఏమో చూద్దాం.  రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.