చిరంజీవి మళ్ళీ పుట్టాడు ..

చిరంజీవి మళ్ళీ పుట్టాడు ..

ప్రముఖ కన్నడ హీరో చిరంజీవి సర్జా అకాల మరణం ఆయన అభిమానులను, కన్నడ ప్రేక్షకులను తీవ్రవిషాదంలోకి నెట్టింది.  చిన్న వయసులోనే గుండెపోటుతో చిరంజీవి మరణించాడని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మరణించే సమయంలో ఆయన భార్య  మేఘన రాజ్ నిండు గర్భిణి కావడంతో గుండెను మరింత బరువెక్కించింది. చిరంజీవి సర్జా కటౌట్ సమక్షంలో ఇటీవలే ఆమెకు సీమంతం కూడా చేశారు.ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన ప్రతిఒక్కరు కన్నీటి పర్యంతం అయ్యారు. కాగా నేడు మేఘన రాజ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అంతే కాదు నేడు చిరంజీవి , మేఘన ఎంగేజ్మెంట్ అయిన రోజు కావడం మరింత విశేషం. చిరంజీవి చనిపోయిన రోజు  తన అన్నయ మళ్ళీ పుడతాడని ఆయన సోదరుడు ధృవ సర్జా అన్న మాటలు నిజమయ్యాయి అని అభిమానులు చెప్పుకుంటున్నారు .