హ్యాట్ చిన్నది.. యమా క్యూటుగున్నది..

హ్యాట్ చిన్నది.. యమా క్యూటుగున్నది..

ఇంగ్లీష్ హ్యాట్ పెట్టుకోవడం ఇప్పుడు అలవాటుగా మారింది.  సినిమాల్లో ఆనాడు సూపర్ స్టార్ కృష్ణ, తరువాత మెగాస్టార్ చిరంజీవి, అనంతర కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సంస్కృతిని సినిమాల్లోకి తీసుకోవచ్చారు.  పవన్ కళ్యాణ్ చాలా సినిమాల్లో కౌబాయ్ క్యాప్ వాడారు.  ఇప్పుడు హీరోయిన్లు కూడా ఇలాంటి క్యాప్ ను వాడుతున్నారు.  

కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్, వరస అవకాశాలు అందిపుచ్చుకుంటూ టాప్ దిశగా దూసుకుపోతున్నది.  ప్రస్తుతం బెల్లంకొండ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది.  సినిమాలు ఉన్నప్పుడు షూటింగ్లో బిజీగా ఉండటం, ఖాళీ దొరికినపుడు వెకేషన్స్ పేరుతో నచ్చిన ప్లేస్ లకు చెక్కెయ్యడం చేస్తుంటారు.  మెహ్రీన్ ఇందుకు విరుద్ధం ఏమీకాదు.  ఖాళీ దొరికిందేమో ఈ అమ్మడు ఎక్కడికో చెక్కేసి.. చటుక్కున హ్యాట్ పెట్టుకొని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  హ్యాట్ పెట్టుకున్న చిన్నది చాలా క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.