నందమూరి హీరోతో మెహ్రీన్

నందమూరి హీరోతో మెహ్రీన్

ఈ ఏడాది ఆరంభంలో తెలుగు పరిశ్రమ అందుకున్న భారీ విజయం 'ఎఫ్ 2'.  ఇందులో మెహ్రీన్ కౌర్ నటనకుగాను ప్రత్యేక ప్రశంసలు అందాయి.  దీంతో ఆమెకు పలు భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.  తెలుగులో ఇప్పటికే గోపీచంద్ సినిమాను ఓకే చేసిన ఆమె తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సరసన నటించేందుకు ఒప్పుకుందట.  ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించనున్నారు.  ఈ చిత్రం కూడా సతీష్ వేగేశ్న గత చిత్రాల్లానే పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది.