'చేసిన పాపాలే కోడెలను వెంటాడుతున్నాయ్‌'

'చేసిన పాపాలే కోడెలను వెంటాడుతున్నాయ్‌'

గుంటూరు జిల్లాలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చేసిన పాపాలే ఇప్పుడు ఆయణ్ను కేసుల రూపంలో వెంటాడుతున్నాయని మంత్రి గౌతమ్‌ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కోడెల హింసను ప్రేరేపించారని ఆరోపించారు. కోడెల కుటుంబానికి ఇటువంటివి కొత్త కాదన్న ఆయన.. ఐదేళ్లలో టీడీపీ నేతలు చేసిన అవినీతిని బయటపెడతామని స్పష్టం చేశారు. 
ఇక.. గత ఐదేళ్లలో ఏపీలో ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని గౌతమ్‌ రెడ్డి అన్నారు. . ఐటీ శాఖ ద్వారా ఉద్యోగ కల్పన కోసం యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. ఐటీ శాఖ ద్వారా సుపరిపాలన అందించేలా గవర్నెన్స్ తీసుకువస్తామని తెలిపారు.