'ఎంఓయూలు జరిగినా పరిశ్రమలు రాలేదు'

'ఎంఓయూలు జరిగినా పరిశ్రమలు రాలేదు'

కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఇవాళ ఆయన అడుగుపెట్టారు. ఏపీఐఐసీ పేమెంట్ క్లియరెన్స్ ఫైల్‌ పై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని అన్నారు. ఇక.. గతంలో అనేక ఎంవోయూలు జరిగినా.. రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదన్న ఆయన.. వచ్చిన పరిశ్రమలు నిఖార్సైనవా..? కాదా..? అనేది పరిశీలిస్తున్నామన్నారు. 42 పరిశ్రమల ఏర్పాటుకు సమస్యలున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. కొన్ని పరిశ్రమలకు భూములు కేటాయించినా ఇప్పటి వరకు అక్కడ పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. ఐటీ శాఖపై ప్రత్యేక దృష్టి పెడతామన్న మేకపాటి.. బీపీఓలను గ్రామస్థాయికి విస్తరిస్తామన్నారు.