బీజేపీ నేతలే పొత్తు కోసం జగన్‌ను సంప్రదించారు...

బీజేపీ నేతలే పొత్తు కోసం జగన్‌ను సంప్రదించారు...

భారతీయ జనతా పార్టీ నేతలు 2014లోనే పొత్తు కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించారన్నారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి... కానీ, జగన్ దానికి నిరాకరించారని... ఎన్నికల తర్వాత మాకు సరైన సంఖ్యాబలం వచ్చి... మా అవసరం వస్తే, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే మద్దతు ఇస్తామని ఆరోజే జగన్ చెప్పారని... ఇప్పటికీ అదే మాటపై ఉన్నారని స్పష్టం చేశారు మేకపాటి. అయితే మీరు రాకపోతే చంద్రబాబు మాకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అప్పుడే బీజేపీ నేతలు చెప్పారన్నారు మేకపాటి. టీడీపీ-బీజేపీ స్నేహం నాలుగేళ్లు బాగానే సాగిన ఇప్పుడెందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయని ఆయన ప్రశ్నించారు.... అంటే ఇన్ని రోజులు చంద్రబాబు ఆయన స్వప్రయోజనాలు చూసుకున్నారు తప్ప... రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోలేదని భావించాల్సి వస్తుందన్నారు మేకపాటి. వాజ్‌పేయి హయాంలో ఎన్డీఏలో చేరిన చంద్రబాబు... రాజభోగాలు అనుభవించి తర్వాత ఎన్డీఏలో చేరి తప్పుచేశానని ప్రకటించారని... మోడీ గ్రాఫ్ తగ్గినా అదే మాట మాట్లాడతారన్నారు మేకపాటి. ఇప్పటికే 29 సార్లు ఢిల్లీ వచ్చిన చంద్రబాబు... ఇప్పుడు 30వ సారి హస్తినకు వచ్చారని... ఆయన రాజకీయ కారణాలతో విన్యాసాలు చేస్తుంటారంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు గురుంచి అన్ని పార్టీలకు తెలుసన్న మేకపాటి... మేం బీజేపీతో ఎందుకు కలుస్తాం... మాది సెక్యూలర్ పార్టీ అన్నారు. హోదాతో పాటు విభజన హామీలు అమలు చేస్తాం... అనే పార్టీకి 2019 లో మద్దతు ఇస్తామంటున్న మేకపాటి ఈ సందర్భంగా ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...