కోటిన్నర కారు వచ్చేసింది

కోటిన్నర కారు వచ్చేసింది

మార్కెట్లో తాజా సంచలనం ఎఎంజి ఇ-63 ఎస్‌ సెడాన్‌ కారును  మెర్సిడెజ్‌ బెంజ్‌  దేశీయ విడుదల చేసింది. దీని ప్రారంభ ధరే రూ.1.5 కోట్లు.  ఇప్పటివరకు 14 ఎఎంజి మోడల్‌ కార్లను అందుబాటులోకి తెచ్చామని తమ కార్లకు కస్టమర్ల నుంచి  స్పందన లభించిందని మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ రోలాండ్‌ ఫోల్గర్‌ తెలిపారు. ఈ ఏడాది మరిన్ని ఎఎంజిలతోపాటు ఇతర మోడళ్లను విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యలో సంస్థ 4,556 కార్లను విక్రయించినట్లు ఫోల్గర్‌ వెల్లడించారు. లగ్జరీ కార్ల మార్కెట్‌లో బెంజ్‌ దాదాపు 50 శాతం వాటా తమదే అన్నారు.