రివ్యూ: మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్

రివ్యూ: మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్

నటీనటులు: అంజలి పాటిల్‌, ఓం కనోజియా, అతుల్‌ కులకర్ణి, మకరంద్‌ దేశ్‌పాండే

సంగీతం: శంకర్‌-ఎహసాన్-లాయ్‌

సినిమాటోగ్రఫీ: పావెల్‌ డైలస్‌

నిర్మాణ సంస్థ: ఆర్‌ఓఎంపీ పిక్చర్స్‌, అహం బ్రహ్మాస్మి ఎంటర్‌టైన్‌మెంట్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాకేశ్ ఓం ప్రకాశ్‌మెహ్రా

సమాజంలో నిత్యం జరిగే సంఘటనలు, సమస్యలను ఇతివృత్తంగా చేసుకొని సినిమాలు తీయడంలో దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా దిట్ట.  ముఖ్యంగా మహిళల యొక్క సమస్యలను తెరపై అద్భుతంగా చూపిస్తాడు.  ఇలాంటి ఇతువృత్తంతోనే ఇప్పుడు మెహ్రా ... మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్ సినిమాను తెరిక్కించాడు.  ఈ సినిమా రోమ్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.  టైటిల్, ట్రైలర్ తో ఇప్పటికే ఆకట్టుకున్న ఈ సినిమా.. ఈరోజు రిలీజ్ అయింది.  మరి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దామా.  

కథ: 

ముంబై మురికివాడలో నివసించే కనోజియా అనే ఎనిమిది సంవత్సరాల బాలుడి తల్లి అంజలి పాటిల్ పై అత్యాచారం జరుగుతుంది.  తల్లి బాధను చూసి తట్టుకోలేని ఆ బాలుడు.. తనకు న్యాయం జరగాలని కోరుతూ ఏకంగా ప్రధానికి లేఖ రాస్తాడు.  కనోజియా లేఖకు ప్రధాని స్పందించాడా లేదా..? కనోజియా ప్రయత్నం ఎంతవరకు ఫలించింది.. ? అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

దర్శకుడు మెహ్రా అన్ని సినిమాల్లో లాగే స్త్రీ సమస్యలను ఇతివృత్తంగా తీసుకున్నాడు.  మురికివాడల్లో ఉండే మహిళలకు రక్షణ ఉండదు.  వారికి ఎలాంటి ప్రమాదం జరిగిన.. వారిపై దాడులు జరిగినా.. అఘాయిత్యాలు జరిగినా.. ఎవరికి చెప్పుకోలేరు.  నోరు తెరిచి చెప్పుకున్నా.. స్పందించే నాధుడు ఉండడు... ఈ విషయాలను చాలా సున్నితంగా ఈ సినిమాలో చూపించాడు.  తల్లికి జరిగిన అన్యాయాన్ని చూసిన పిల్లవాడి మనసు ఎలా చలించిపోతుంది... ఆ పసి వయసులో ఎలా స్పందించాడు అనే విషయాలను సున్నితంగా చూపించాడు.  ఫస్ట్ హాఫ్ అంతా స్పెషల్ సాంగ్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్, శృంగారం వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది.  సెకండ్ హాఫ్ తల్లికి జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడు.  ప్రధానికి రాసిన లేఖ వివరాలు..దానికి వచ్చిన స్పందన వంటి విషయాల చుట్టూ సినిమా నడుస్తుంది.  అడల్ట్ కంటెంట్ ఎక్కువగా సినిమాకు మైనస్ గా మారిందని చెప్పొచ్చు.  

నటీనటుల పనితీరు: 

బాలుడు కనోజియా, అంజలి పాటిల్ లు సినిమాకు ప్రాణం పోశారు. దాదాపుగా ఈ రెండు పాత్రల చుట్టే కథ నడుస్తుంది.  తల్లికి జరిగిన అన్యాయాన్ని అర్ధం చేసుకున్న కనోజియా, ఆ బాధను తన మాటల రూపంలో పలికించిన తీరు ఆలోచనలో పడేస్తుంది.  తల్లిపాత్ర కన్నీరు పెట్టిస్తుంది.  

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు మెహ్రా సినిమాను చిత్రీకరించిన తీరు చాలా బాగుంది.  రెండు పాత్రల చుట్టూనే కథను తిప్పినా.. చెప్పిన విధానం బాగుంది.  నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.  

పాజిటివ్ పాయింట్స్: 

కథ 

కథనాలు 

నటీనటులు 

నిర్మాణ విలువలు 

నెగెటివ్ పాయింట్స్: 

శృతిమించిన అడల్ట్ సన్నివేశాలు 

చివరిగా: తల్లికోసం బాలుడి పోరాటం