ఇండియాబుల్స్ హౌసింగ్ తో విలీనానికి లక్ష్మీ విలాస్ బ్యాంక్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్

ఇండియాబుల్స్ హౌసింగ్ తో విలీనానికి లక్ష్మీ విలాస్ బ్యాంక్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్

ప్రైవేట్ రంగంలోని లక్ష్మీ విలాస్ బ్యాంక్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తో విలీనానికి మార్గం సుగమమైంది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ తో షేర్ స్వాప్ ఎక్విజిషన్ కు తమ బోర్డు అంగీకారం తెలిపినట్టు శుక్రవారం లక్ష్మీ విలాస్ బ్యాంక్ ప్రకటించింది.

మీడియా కథనాల ప్రకారం ఈ విలీన ప్రతిపాదనను ఆర్బీఐ పరిశీలిస్తుంది. కేంద్ర బ్యాంక్ అమోదం తర్వాతే రెండు కంపెనీల విలీనానికి లైన్ క్లియర్ అవుతుంది. 

తమ షేర్ హోల్డర్లకు ప్రతి షేర్ కి ఇండియాబుల్స్ 0.14 షేర్ లభిస్తుందని లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. లక్ష్మీ విలాస్ బ్యాంకులో వరుసగా రెండో రోజున 5 శాతం సర్కిట్ వచ్చింది. రూ.92.75 దగ్గర క్లోజైంది. ఇండియాబుల్స్ హౌసింగ్ తో విలీనం వార్తలతో ప్రైవేట్ సెక్టార్ లోని లెండర్ బ్యాంక్ షేర్ లాభపడుతోంది.

గత మూడు ట్రేడింగ్ సెషన్లలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్ 2 శాతం బలపడి రూ.916 స్థాయికి చేరుకుంది. తర్వాత వేగం తగ్గి షేర్ రూ.903 దగ్గరలో క్లోజ్ అయింది. ఈ ఒప్పందం ప్రకటన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చింది.