నాన్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మెరిట్ స్కాలర్‌షిప్స్

 నాన్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మెరిట్ స్కాలర్‌షిప్స్
నాన్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు విఐటి-ఎపి విశ్వవిద్యాలయం మెరిట్ స్కాలర్‌షిప్స్
 
విఐటి-ఎపి విశ్వవిద్యాలయంలో BBA, Law, B. Com, B.Sc. మరియు B.A. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో  చేరే అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇచ్చే  లక్ష్యంగా జివి మెరిట్ స్కాలర్‌షిప్ మరియు శ్రీమతి రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్‌షిప్‌ను విఐటి ఉపాధ్యక్షుడు డా|| శేఖర్ విశ్వనాథన్ ప్రకటించారు. విశ్వవిద్యాలయ సామజిక భాద్యతగా సాగుతున్న స్టార్స్ ప్రోగ్రామ్ కూడా కొనసాగుతూనే ఉంటుందని తెలియచేసారు. 
 
జివి మెరిట్ స్కాలర్‌షిప్ దేశవ్యాప్తంగా ఏ బోర్డు టాపర్‌కైనా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం యొక్క అన్ని సంవత్సరాలకు 100% స్కాలర్‌షిప్ లభిస్తుందని విఐటి-ఎపి వైస్ ఛాన్సలర్ డా|| ఎస్ వి కోటా రెడ్డి అన్నారు. 
 
విఐటి-ఎపి రిజిస్ట్రార్ డా|| సి.ఎల్.వి శివకుమార్ మాట్లాడుతూ శ్రీమతి రాజేశ్వరి అమ్మాళ్ మెరిట్ స్కాలర్‌షిప్ పొందటానికి అర్హతలుగా అభ్యర్థి దేశవ్యాప్తంగా ఏదేని జిల్లా టాపర్‌గా ఉండాలి. అతను / ఆమె డిగ్రీ ప్రోగ్రాం యొక్క అన్ని సంవత్సరాలకు 50% స్కాలర్‌షిప్ పొందుతారు. జిల్లా టాపర్ ఒక అమ్మాయి అయితే, ఆమెకు అదనంగా 25% స్కాలర్‌షిప్ లభిస్తుంది (ఇది 75% స్కాలర్‌షిప్ అవుతుంది.

 
బి.బి.ఎ లో జనరల్ మేనేజ్మెంట్ , బిజినెస్ అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫిన్టెక్ కోర్సులను, న్యాయ విభాగంలో బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్), బి.బి.ఏ. ఎల్.ఎల్.బి (హనర్స్) కోర్సులను, బి.కామ్ కోర్స్ మూడేళ్ళతో పాటు సిఎంఏ, సిఏ, ఏసిఎస్ లకు ప్రాధమికంగా బోదించటం జరుగుతుంది.  అదే విధంగా డ్యూయల్ డిగ్రీ విభాగంలో బి.ఏ. మరియు ఎం.ఏ (పబ్లిక్ సర్వీసెస్), బి.ఎస్సి. మరియు ఎం.ఎస్సి (డేటా సైన్సు) కోర్సులను అందచేయటం జరుగుతుంది.
 
ఈ రెండు మెరిట్ స్కాలర్‌షిప్‌లను నాన్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్మిషన్స్ 2021 నుండి అమలులోనికి వస్తాయని ఈ ప్రక్రియ ది. 17.02.2021 తో ప్రారంభమయ్యి ది. 31.05.2021 తో ముగుస్తుందని విఐటి-ఎపి విశ్వవిద్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ –అడ్మిషన్స్  డా|| ఆర్. తహియా అఫ్జల్ తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.vitap.ac.in ను సందర్శించ వచ్చని లేదా 7901091283 కి కాల్ చేసి లేదా  కి [email protected] ఈమెయిలు చేసి వివరాలను పొందవచ్చని తెలిపారు.